Allagadda: కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలోని పట్టణ పోలీస్ స్టేషన్లో ఓ వింత ఘటన చోటు చేసుకుంది. స్టేషన్కు కేసులు ఎక్కువగా వస్తున్నాయని పోలీసులు.. శాంతి పూజలు నిర్వహించడం సంచలనంగా మారింది. ఆదివారం పోలీస్ స్టేషన్ ఆవరణలో అర్చకులు ఎస్సైల సమక్షంలో గోమూత్రం చల్లించి విశేష పూజలు చేశారు.
ఆళ్లగడ్డ పోలీస్స్టేషన్లో శాంతి పూజలు... ఎందుకంటే... - ఆళ్లగడ్డ లేటెస్ట్ అప్డేట్
Allagadda: కేసులు ఎక్కువగా వస్తున్నాయంటూ పోలీస్ స్టేషన్లో శాంతి పూజలు చేసిన ఘటన కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో చోటుచేసుకుంది. పోలీస్ స్టేషన్ ఆవరణలో గోమూత్రం చల్లించి విశేష పూజలు చేశారు.
Allagadda: ఆళ్లగడ్డ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో గత కొన్ని వారాలుగా కేసుల సంఖ్య పెరిగాయి. అందులో పోలీసులకు ఇబ్బందిగా మారే కేసులు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. అంతేకాకుండా శుక్రవారం పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఓ కానిస్టేబుల్ పాముకాటుకుతో తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఇవన్నీ గమనించి శాంతి పూజ చేస్తే సమస్యలు తొలగుతాయని కొందరు చెప్పడంతో.. పోలీసులు ఇలా చేసినట్లు తెలుస్తోంది. పోలీసులు ఇంకో అడుగు ముందుకేసి జంతుబలి ఇచ్చినట్లు సమాచారం.
ఇదీ చదవండి:Murder: తూర్పుగోదావరి జిల్లాలో తండ్రిని హత్య చేసిన తనయుడు