'పర్యావరణాన్ని కాపాడండి... మొక్కలు నాటండి' - nature
పొలాల్లో ఉన్న చెట్లను నరికేయవద్దని రైతులకు నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి సూచించారు.
ఎంపీ , ఎమ్మెల్యే
పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కర్నూలు జిల్లా నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి అన్నారు. అందుకే ఒక్కో రైతు ఒక మొక్క నాటాలని సూచించారు. పొలాల్లో ఉన్న చెట్లను నరికి వేయవద్దని కోరారు. రాజకీయాలకు అతీతంగా రైతులు సంఘటితంగా ఉండాలన్నారు. ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డితో పాటు... ఎమ్మెల్యే శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డిలను నంది రైతు సమాఖ్య సభ్యులు ఘనంగా సన్మానించారు.