'వచ్చే ఎన్నికల్లో తెదేపా నుంచి చంద్రబాబు ఒక్కరే గెలుస్తారు' - మంత్రి గుమ్మనూరు జయరాం వార్తలు
దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు కొనసాగుతుంటే తెదేపా అధినేత చంద్రబాబునాయుడు... ప్రభుత్వ పాలనను కరోనా వైరస్‌తో పోల్చడం సరికాదని మంత్రి గుమ్మనూరు జయరాం అన్నారు. కర్నూలులోని లలిత కళాసమితిలో జరిగిన వాల్మీకీ సభకు ముఖ్య అతిథిగా మంత్రి హాజరయ్యారు. కర్నూలుకు హైకోర్టు వస్తుంటే చంద్రబాబు అడ్డుకుంటున్నారని విమర్శించారు. తమ భూములను కాపాడుకోవటం కోసమే రాజధాని అమరావతిలోనే ఉండాలని చంద్రబాబు అంటున్నారని ఆరోపించారు. ఇలా చేస్తే వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు తప్ప ఎవరూ గెలవరని మంత్రి అన్నారు.
minister gummanuru jayaram