రామ తీర్థం ఘటనను తెదేపా రాజకీయంగా వాడుకుంటోందని పురపాలక శాఖ మంత్రి బొత్ససత్యనారాయణ ఆరోపించారు. ప్రతీ అంశాన్నీ రాజకీయం చేయాలంటే కుదరదని ఆయన తెదేపాకు హితవు పలికారు. ఈ ఘటనపై విచారణ జరుగుతోందని.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. ఉచిత ఇళ్లపట్టాల పంపిణీలో అవినీతి జరిగిందని ఆరోపిస్తున్న తెదేపా దాన్ని నిరూపించాలని మంత్రి డిమాండ్ చేశారు.
సీఎం జగన్ రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తున్నారన్నారు. రాష్ట్రంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు దేశంలో మరెక్కడా అమలు కాలేదన్నారు. కరోనా మహమ్మారిని సమర్థంగా నియంత్రించగలిగామని మంత్రి బొత్స వెల్లడించారు. 30.75 లక్షల మందికి ఇళ్లపట్టాలు ఇవ్వవటం విప్లవాత్మకమని వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష పార్టీ..కుట్రలతో ప్రతీ పథకాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తోందన్నారు.