కర్నూలు కొత్త డీఐజీ నియామకం - new joining
కర్నూల్ రేంజ్ డీఐజీగా పి. వెంకటరామిరెడ్డి పదవి బాధ్యతలు చేపట్టారు.
కర్నూలు కొత్త డీఐజీ నియామకం
కర్నూల్ రేంజ్ డీఐజీగా పి. వెంకటరామిరెడ్డి ఈరోజు పదవి బాధ్యతలు స్వీకరించారు. కర్నూల్ డీఐజీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ ఫకీరప్ప, ఇతర ఉన్నతాధికారులు డీఐజీని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. తనను కర్నూల్ జిల్లా డీఐజీగా నియమించిన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి, రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.