కేజీ బంగారం పట్టివేత
ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున పోలీసులు ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఈ నేపథ్యంలో కర్నూలు సుంకేశుల వద్ద తనిఖీలు చేస్తుండగా కేజీ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
స్వాధీనం చేసుకున్న బంగారంతో పోలీసులు
ఎలాంటి పత్రాలు లేకుండా కారులో తరలిస్తున్న కేజీ బంగారు ఆభరణాలను కర్నూలు పోలీసులు పట్టుకున్నారు. సుంకేశుల వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా... అలంపూర్ నుంచి వచ్చిన కారులో ఈ ఆభరణాలను గుర్తించారు. తెలంగాణ రాష్ట్రం అలంపూర్ వాసి రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి చెందిన ఆభరణాలని పోలీసులు తెలిపారు. వీటికి ఎలాంటి పత్రాలు లేనందున... సీజ్ చేశామని వెల్లడించారు .