నాలుగు రోజుల్లో వైకాపా ఎన్నికల ప్రణాళిక విడుదల చేస్తా. రాష్ట్రంలోని ప్రతి పేదవాడికి న్యాయం చేస్తా. పాదయాత్రలో ఎన్నో కష్టాలు చూశా. మీకు ఒకటే చెప్తున్నా నేను విన్నా... నేను ఉన్నా- జగన్
రోడ్‌షోలో జగన్
By
Published : Mar 18, 2019, 2:21 PM IST
పాణ్యం రోడ్‌షో లో జగన్
ప్రజలకు మేలు చేయాలన్న ఆలోచన తెదేపా ప్రభుత్వానికి లేదనిప్రతిపక్ష నేత జగన్విమర్శించారు. గిట్టుబాటు ధర లేక రైతులు, పిల్లల చదువు కోసం ఆస్తులు అమ్ముకునే తల్లిదండ్రులను, ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురు చూసే నిరుద్యోగులను తన పాదయాత్రలో చూశానని చెప్పారు.వారందరికీ తానున్నాననేభరోసా ఇస్తున్నానని కర్నూలు జిల్లా పాణ్యంలో నిర్వహించిన రోడ్షోలోఅన్నారు. ''మీకు ఒకటే చెప్తున్నా నేను విన్నా... నేను ఉన్నా'' అని ప్రజలకు భరోసా ఇచ్చారు.