ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

HC Justice: మల్లన్న సేవలో హైకోర్టు సీజే దంపతులు .. శేషవస్త్రాలు , ప్రసాదాలు అందజేత - మల్లన్న సేవలో హైకోర్టు సీజే దంపతులు

HC Justice In Srisailam: శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా దంపతులు ఆదివారం దర్శించుకున్నారు. జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా దంపతులు స్వామివారికి రుద్రాభిషేకము, అమ్మవారికి కుంకుమార్చన పూజలు నిర్వహించారు.

HC Justice In Srisailam
మల్లన్న సేవలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి... శేషవస్త్రాలు , ప్రసాదాలు అందజేత

By

Published : Mar 27, 2022, 9:28 AM IST

HC Justice In Srisailam: కర్నూలు జిల్లా శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా దంపతులు ఆదివారం దర్శించుకున్నారు. వారిని ఆలయ మహాద్వారం వద్ద జిల్లా కలెక్టర్ కోటేశ్వరరావు, జిల్లా జడ్జి రాధాకృష్ణ కృపా సాగర్, దేవస్థానం ఈవో లవన్న మర్యాద పూర్వకంగా స్వాగతం పలికారు. జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా దంపతులు స్వామివారికి రుద్రాభిషేకము, అమ్మవారికి కుంకుమార్చన పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలో జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా దంపతులకు అర్చకులు, వేదపండితులు ఆశీర్వచనాలు పలికారు. జిల్లా కలెక్టర్ , ఈవో స్వామి, అమ్మ వార్ల శేషవస్త్రాలు , ప్రసాదాలు అందజేసి సత్కరించారు.

ABOUT THE AUTHOR

...view details