కర్నూలు జిల్లా నంద్యాలలో ఓ మహిళపై దాడి చేసి బంగారు అభరణాలు అపహరించారు. పద్మావతి నగర్లోని ఆమె నివాసానికి వెళ్తుండగా ముగ్గురు యువకులు అడ్డగించి రాయితో తలపై గాయపరిచారని బాధితురాలు ఆరోపించింది. మెడలో నల్లపూసల దండ, తాళి బొట్టు, మరో గొలుసు లాక్కెళ్లిపోయారని తెలిపింది. 18తులాల అలాగే పర్సులోని నగదు దోచుకెళ్లినట్లు పేర్కొంది. దుండగుల దాడిలో గాయపడిన షాలినిని నంద్యాల ఆసుపత్రికి తరలించారు. రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.
'మహిళపై దాడి...18 తులాల బంగారు అభరణాలు అపహరణ'
గొలుసు దొంగల ఆగడాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి. నంద్యాలలో పట్టపగలే ఓ మహిళపై దాడి చేసి 18తులాల బంగారు అభరణాలు ఎత్తుకెళ్లిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.
'మహిళపై దాడి...18 తులాల బంగారు అభరణాలు అపహరణ'