cotton record price: కర్నూలు జిల్లా ఆదోని మార్కెట్ యార్డులో పత్తికి రికార్డు ధర పలికింది. మొదటి సారిగా పత్తి ధర రూ.12 వేల మార్కును దాటింది. బుధవారం క్వింటా పత్తి ధర గరిష్టంగా రూ.12,059 పలకింది. ఆదోని వ్యవసాయ యార్డు చరిత్రలోనే ఇది రికార్డు ధర అని రైతులు తెలిపారు. ఈరోజు 1,588 క్వింటాళ్ల పత్తిని రైతులు అమ్మకానికి తెచ్చారు. పత్తి ధర పెరగడం పట్ల రైతులు సంతోషం వ్యక్తం చేశారు. కానీ.. సీజన్ ఆరంభంలోనే అధిక ధరలు ఉంటే రైతులకు లాభాలు చేకూరేవన్నారు. దిగుబడులు తగ్గడం, పత్తి గింజలు ధరలు పెరగడం వల్ల పత్తికి మంచి డిమాండ్ ఏర్పడి ధరలు పెరుగుతున్నాయని వ్యాపార వర్గాలు తెలిపాయి. పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే.. ఆదోనిలోనే అత్యధిక ధరలు ఉన్నాయని వ్యాపారస్థులు చెబుతున్నారు.
ఆదోని మార్కెట్ యార్డులో.. పత్తికి రికార్డుస్థాయి ధర - అదోనిలో పత్తికి అధిక ధర
cotton record price: ఆదోని మార్కెట్ యార్డులో పత్తి ధర రూ.12 వేలు దాటింది. క్వింటా పత్తి గరిష్ఠ ధర రూ.12,059, కనిష్ఠ ధర రూ.7,175గా ఉంది. ఇవాళ 1,588 క్వింటాళ్ల పత్తిని రైతులు అమ్మకానికి తెచ్చారు.
ఆదోని మార్కెట్ యార్డులో పత్తి ధర