కర్నూలు జిల్లాను కరోనా వదలటం లేదు. రోజురోజుకు పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. నిన్న 8 మందికి పాజిటివ్ వస్తే... ఇవాళ 9 మందికి కరోనా నిర్ధరణ అయ్యింది. వీరిలో ఐదుగురు కోయంబేడు నుంచి వచ్చినవారే అని అధికారులు తెలిపారు. దీంతో జిల్లాలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 608 కి చేరింది. నిన్న కరోనాను జయించి 47 మంది ఇళ్లకు చేరుకున్నారు. ఇప్పటి వరకు 390 మంది డిశ్చార్జ్ అయ్యారు. నిన్న ఒకరు కరోనాతో మరణించారు. దీంతో మరణాల సంఖ్య 19కి చేరింది. ఆసుపత్రుల్లో 199 మంది చికిత్స పొందుతున్నారు.
వదలని కరోనా... నేడు 9 కేసులు నమోదు - కర్నూలులో కరోనా కేసులు
కర్నూలు జిల్లాలో కరోనా విజృంభిస్తూనే ఉంది. ఇవాళ 9 మందికి కరోనా సోకినట్లు నిర్ధరణ అయ్యింది. వీరిలో ఐదుగురు కోయంబేడు నుంచి వచ్చినవారే అని అధికారులు తెలిపారు. దీంతో జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 608కి చేరింది.
కర్నూలులో కరోనా కేసులు