Congress protest: పెంచిన విద్యుత్ ఛార్జీలు, గ్యాస్, పెట్రోల్ ధరలను వెంటనే తగ్గించాలని కర్నూలులో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ముందు కాంగ్రెస్ నేతలు ధర్నా చేపట్టారు. పెరిగిన ధరలతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు జీవించాలంటే కష్టంగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఎదుట ద్విచక్ర వాహనం, గ్యాస్ సిలిండర్లకు పూలదండలు వేసి నిరసన తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోటీపడి మరి నిత్యావసర ధరలు పెంచుతున్నారని మండిపడ్డారు. పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు.
విద్యుత్ చార్జీల పెంపుపై కాంగ్రెస్ ఆందోళన - కర్నూలు లేెటెస్ట్ అప్డేట్స్
Congress protest: విద్యుత్ ఛార్జీలు, గ్యాస్, పెట్రోల్ ధరల పెంపును నిరసిస్తూ కర్నూలులో కాంగ్రెస్ నేతలు నిరసన చేపట్టారు. ధరలు పెంచుకుంటూపోతే సామాన్య ప్రజలు బతకడం కష్టమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు.
విద్యుత్ చార్జీల పెంపుపై కాంగ్రెస్ ఆందోళన