ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ముఖ్యమంత్రి చెప్పారు.. పోటీకి సరేనన్నారు! - tdp

కర్నూలు జిల్లా శ్రీశైలం నియోజకవర్గ తెదేపా అభ్యర్థి బుడ్డా రాజశేఖరరెడ్డి.. మనసు మార్చుకున్నారు. పోటీ నుంచి తప్పుకుంటానన్న నిర్ణయం నుంచి వెనక్కు తగ్గారు. ఎన్నికల బరిలో నిలుస్తున్నట్టు ప్రకటించారు.

సీఎం చంద్రబాబుతో బుడ్డా రాజశేఖర్ రెడ్డి

By

Published : Mar 19, 2019, 10:45 PM IST

మనసు మార్చుకున్న బుడ్డా
కుటుంబ పరిస్థితుల కారణంగా రాజకీయాలకు గుడ్​బై చెప్పిన శ్రీశైలం తెదేపా అభ్యర్థి బుడ్డా రాజశేఖర్ రెడ్డి... మరలా పోటీకి సిద్ధమయ్యారు. సీఎం చంద్రబాబు బుజ్జగించిన కారణంగా..మనసు మార్చుకున్నారు. ఇవాళ కర్నూలు పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి... బుడ్డా రాజశేఖర్​ రెడ్డితో మాట్లాడారు.కుటుంబ పరిస్థితులను చూసి అధైర్యపడవద్దని ధైర్యం చెప్పారు. ఎన్నికలబరిలోకి దిగాలని చెప్పారు.అనంతరం వేల్పనూరులో జరిగిన కార్యకర్తల సమావేశానికి హాజరైన రాజశేఖరరెడ్డి... తాను పోటీలో ఉన్నట్టు ప్రకటించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details