ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

TOP NEWS : నేటి ప్రధానవార్తలు @ 3pm

.

By

Published : Dec 7, 2021, 3:03 PM IST

నేటి ప్రధానవార్తలు
నేటి ప్రధానవార్తలు

  • Employees Protest: 'కోరుకుని తెచ్చుకున్న ప్రభుత్వం.. ఇబ్బందులకు గురి చేస్తోంది'

employees protest: ప్రభుత్వం వేతన సవరణ ప్రకటించే వరకు ఉద్యమం ఆగదని ఉద్యోగ సంఘాలు స్పష్టం చేశాయి. కోరుకుని తెచ్చుకున్న ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశాయి. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • Somu Veerraju on Annamayya Dam: 'పొరపాట్లు సరిదిద్దుకోవాలి.. విమర్శలు సరికాదు'

somu veerraju: అన్నమయ్య ప్రాజెక్టు విషయంలో కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్​పై విమర్శలు చేయడం సరికాదని సోము వీర్రాజు అన్నారు. పొరపాట్లు సరిదిద్దుకోవాలి గానీ విమర్శలు చేయడం మంచిది కాదని హితవు పలికారు.పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • TRS MPs boycott from Parliament: పార్లమెంట్​ సమావేశాల నుంచి తెరాస బాయ్​కాట్

తెరాస ఆందోళనపై కేంద్రం స్పందించడం లేదని, కేంద్రప్రభుత్వ తీరుకు నిరసనగా చట్టసభను బాయ్‌కాట్ చేస్తున్నామని తెరాస ఎంపీ కె. కేశవరావు స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో ఎఫ్‌సీఐ నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపించారు.పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • 'మీరు మారకపోతే నేనే మార్చేస్తా'... ఎంపీలకు మోదీ వార్నింగ్!

BJP Parliamentary party meeting: భాజపా పార్లమెంటరీ సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్లమెంట్​కు హాజరయ్యే విషయంపై పార్టీ ఎంపీలకు హెచ్చరికలు చేశారు.పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • వారికి ప్రభుత్వం పరిహారం చెల్లించాల్సిందే: రాహుల్​

Rahul Gandhi news today: లోక్​సభ వేదికగా కేంద్రంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు కాంగ్రెస్ నేత రాహుల్​ గాంధీ. రైతు నిరసనల్లో మరణించిన వారి కుటుంబాలకు పరిహారం చెల్లించాలని డిమాండ్​ చేశారు. రైతుల మరణాలపై డేటా లేదని ప్రభుత్వం ప్రకటించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • Nagaland Army killings: 'పౌరులను కాల్చేసి.. మృతదేహాలను దాచే యత్నం'

Nagaland Army killings: భద్రతా దళాల కాల్పుల్లో 13 మంది మరణించిన ఘటనపై నాగాలాండ్ రాష్ట్ర డీజీపీ, స్థానిక కమిషనర్ సంయుక్త నివేదిక రూపొందించారు. పౌరుల గుర్తింపును నిర్ధరించుకునే ప్రయత్నాలేవీ సైన్యం చేయలేదని నివేదికలో పేర్కొన్నారు. మృతదేహాలను దాచిపెట్టే ప్రయత్నం చేశారని వివరించారు.పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • '2022 బీజింగ్​ ఒలింపిక్స్​ దౌత్యపరంగా బహిష్కరణ'

America Winter Olympics: 2022లో చైనాలో జరగబోయే ఒలింపిక్స్​ను దౌత్యపరంగా బహిష్కరిస్తున్నట్లు అమెరికా ప్రభుత్వం తెలిపింది. అమెరికాకు చెందిన అథ్లెట్లు.. ఒలింపిక్స్​లో పాల్గొంటారు కానీ అధికారులను మాత్రం పంపించబోమని శ్వేతసౌధం ప్రెస్ సెక్రటరీ జెన్​ సాకి తెలిపారు.పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • Triguni EzE Eats Story: వయసు డెబ్భై.. సంపాదన రూ. కోట్లలో...

Triguni EzE Eats Story: 69 ఏళ్ల వయసు.. కృష్ణా.. రామా అంటూ కూర్చోవాలనుకోలేదామె! ఏదైనా ప్రయత్నించాలనుకుంది. నచ్చిన పాకశాస్త్రాన్ని ఉపయోగించి సంస్థను ప్రారంభించింది. ప్రముఖ విమానయాన సంస్థలకు సైతం ఆహారాన్ని పంపిణీ చేసే స్థాయికి ఎదిగింది.పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • IND vs SA Series: భారత్​తో టెస్టు సిరీస్​.. దక్షిణాఫ్రికా జట్టు ప్రకటన

South Africa Test Squad: న్యూజిలాండ్​తో జరిగిన టెస్టు సిరీస్ గెలుచుకున్న టీమ్ఇండియా త్వరలోనే దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. డిసెంబర్ 26న భారత్-సౌతాఫ్రికా మధ్య తొలి టెస్టు జరగనుంది. ఈ నేపథ్యంలో మూడు టెస్టుల ఈ సిరీస్​ కోసం జట్టును ప్రకటించింది సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు.పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • 'చైతూతో విడిపోయాక చచ్చిపోతానేమో అనుకున్నా.. కానీ'

Chaysam Divorce: నాగ చైతన్యతో విడిపోయిన తర్వాత తాను ఎంత బలవంతురాలినో అర్థమైందని చెప్పింది హీరోయిన్ సమంత. అందుకు తానెంతో గర్వంగా భావిస్తున్నట్లు తెలిపింది.పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

ABOUT THE AUTHOR

...view details