పూర్వ విద్యార్థుల సంఘం... యువతకు సాయం - old students
పేద విద్యార్థులకు శిక్షణ అందించి.. వారికి ఉపాధికి బాటలు వేస్తోంది కాకినాడ ఇంజనీరింగ్ కళాశాల పూర్వవిద్యార్థుల సంఘం. ఏపీ సంక్షేమశాఖతో కలసి పలువురు ఇంటర్మీడియట్ విద్యార్థులకు అనేక విభాగాల్లో శిక్షణా కార్యక్రమాలు చేపడుతున్నారు. శిక్షణ ఇచ్చి వదిలివేయకుండా వారికి ఉపాధి అవకాశాలు లభించేలా చేస్తుంది.
పూర్వ విద్యార్థుల సంఘం... యువతకు సాయం
ఇంటర్ పూర్తిచేసి.. ఖాళీగా ఉన్న యువతకు కాకినాడ ఇంజనీరింగ్ పూర్వవిద్యార్థుల సంఘం చేయూతనిస్తోంది. వారికి వివిధ రంగాల్లో శిక్షణ కల్పించి ఉద్యోగ అవకాశాలను కల్పిస్తోంది. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఈ తరగతులను నిర్వహిస్తున్నారు. ఎస్సీ, బీసీ కులాలకు చెందిన పేద యువతకు... ఈ శిక్షణ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పిస్తున్నారు. వీరికి వివిధ అంశాల్లో 2 నెలలు ఉచితంగా తర్ఫీదు ఇస్తారు. విద్యార్థులకు భోజన వసతులను నిర్వాహకులు కల్పిస్తున్నారు.