రాష్ట్రంలో కొత్తగా 7 లక్షలమంది అన్నదాతలు రైతు భరోసాలో పేర్లు నమోదు చేసుకున్నారని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. కాకినాడలో మీడియాతో మాట్లాడిన మంత్రి... పీఎం కిసాన్ యోజనలో అర్హత పొందనివారి పేర్లు సైతం రైతు భరోసాలో నమోదు చేశామని అన్నారు. కౌలురైతులను ఆదుకోవాలన్నదే సీఎం జగన్ లక్ష్యమన్న కన్నబాబు... రైతునమోదు ప్రక్రియ ఇంకా కొనసాగుతోందని స్పష్టం చేశారు. మరణించిన రైతుల పేర్లు సైతం అర్హుల జాబితాలో ఉన్నాయన్న మంత్రి... అన్ని విషయాలూ పరిశీలించి రైతుభరోసా పథకం అమలు చేస్తామని చెప్పారు.
'కౌలు రైతులను ఆదుకోవాలన్నదే సీఎం జగన్ లక్ష్యం' - Tenant farmer in ap
పీఎం కిసాన్ యోజనలో అర్హత లేనివారి పేర్లు సైతం... రైతు భరోసాలో నమోదయ్యాయని మంత్రి కన్నబాబు వివరించారు. కాకినాడలో కన్నబాబు మీడియాతో మాట్లాడారు. అన్ని విషయాలూ పరిశీలించి రైతుభరోసా పథకం అమలు చేస్తామని చెప్పారు.
మంత్రి కన్నబాబు