తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ నగరపాలక సంస్థకు ప్రజలు చెల్లించాల్సిన వివిధ పన్నులు ఈ నెల 31న లోపు చెల్లించాలని కమిషనర్ స్వప్నిల్ దినకర్ విజ్ఞప్తి చేశారు. పన్నులు చెల్లిస్తేనే వివిధ అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు సాగుతాయన్నారు. ప్రజలకు అవగాహన కల్పించేందుకే పన్నులు చెల్లించకపోతే ఆస్తులు జప్తు చేస్తామంటూ వాహనాన్నితిప్పామన్న కమిషనర్....కానీ మూడు, నాలుగు గంటల తర్వాత ఆపేశామని చెప్పారు. అదే సమయంలో పన్నులు చెల్లించకపోతే ఆస్తులు జప్తు చేసే అధికారం మున్సిపల్ చట్టంలో ఉందని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్పష్టం చేయడం చర్చనీయాంశంగా మారింది.
'అందుకోసమే ఆస్తులు జప్తు చేస్తామంటూ వాహనాన్ని తిప్పాము '
కాకినాడ నగరపాలక సంస్థకు ప్రజలు చెల్లించాల్సిన వివిధ పన్నులు ఈ నెల 31న లోపు చెల్లించాలని కమిషనర్ స్వప్నిల్ దినకర్ విజ్ఞప్తి చేశారు. ప్రజలకు అవగాహన కల్పించేందుకే పన్నులు చెల్లించకపోతే ఆస్తులు జప్తు చేస్తామంటూ వాహనాన్నితిప్పామన్నారు.
Kakinada Municipal Corporation Commissioner Swapnil Dinkar