తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద గోదావరిలో మునిగిన పర్యాటక బోటును వెలికితీసేందుకు మరోసారి ప్రయత్నం చేయనున్నట్లు... జిల్లా కలెక్టర్ మురళీధర్‌రెడ్డి చెప్పారు. సంప్రదాయ మత్స్యకార నిపుణుడు ధర్మాడి సత్యం బృందం కలెక్టర్‌ను కలిసి నదిలో వరద తగ్గినందున మరోసారి ప్రయత్నం చేస్తామని చెప్పింది. దీనికి కలెక్టర్ అనుమతి ఇచ్చారు. గత నెల 15న బోటు మునిగిపోగా... వారం క్రితం వెలికితీసే పనులు ప్రారంభించారు. నదిలో వరద పెరగడంతో... ధర్మాడి సత్యం బృందం పనులు నిలిపేసింది. గోదావరిలో వరద తగ్గడంతో కచ్చులూరులో తిరిగి సెర్చ్ ఆపరేషన్ ప్రారంభిస్తారని పాలనాధికారి మురళీధర్‌రెడ్డి తెలిపారు.
కచ్చులూరు బోటు ప్రమాదం...వెలికితీతకు మరో ప్రయత్నం - Kachchaloor boat accident
గోదావరిలో వరద తగ్గడంతో కచ్చులూరు వద్ద తిరిగి సెర్చ్ ఆపరేషన్ ప్రారంభిస్తామని... తూర్పుగోదావరి జిల్లా పాలనాధికారి మురళీధర్‌రెడ్డి తెలిపారు. బోటు వెలికితీత కోసం మరో ప్రయత్నానికి కలెక్టర్ అనుమతి ఇచ్చారు.
కచ్చులూరు బోటు ప్రమాదం