ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కుంగిన పిల్లర్లు.. ఇళ్లు ఖాళీ చేసిన యజమానులు!

తూర్పుగోదావరి జిల్లా కాకినాడ నగరంలో అపార్ట్‌మెంట్‌ పిల్లర్లు భూమిలోకి కుంగాయి. భాస్కర్ ఎస్టేట్స్‌ అపార్ట్‌మెంట్ 3 పిల్లర్లు భూమిలోకి కుంగాయి. దీంతో 5 అంతస్తుల భవనం ఖాళీ చేశారు. ఘటనా స్థలానికి అధికారులు, పోలీసులు చేరుకొని పరిస్థితిని పరిశీలించారు.

భూమిలోకి కుంగిన అపార్ట్‌మెంట్‌ పిల్లర్లు

By

Published : Sep 19, 2019, 6:32 PM IST

Updated : Sep 19, 2019, 9:39 PM IST

తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో 5 అంతస్తుల భవంతి పిల్లర్లు దెబ్బతినడం కారణంగా... కూలిపోతుందన్న ఆందోళన నెలకొంది. సినిమా రోడ్డులోని దేవీ మల్టీ కాంప్లెక్స్‌ సమీపంలో... 5 అంతస్తుల భాస్కర్‌ అపార్ట్‌మెంట్‌ మధ్యలో 3 పిల్లర్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. కాంక్రీటంతా పూర్తిగా ధ్వంసమవడం కారణంగా అపార్ట్‌మెంట్‌ వాసులు భయాందోళనకు గురవుతున్నారు. సమాచారం తెలుసుకున్న నగరపాలక సంస్థ అధికారులు, పోలీసులు అపార్ట్‌మెంటును పరిశీలించారు.

భూమిలోకి కుంగిన అపార్ట్‌మెంట్‌ పిల్లర్లు

ఈ అపార్ట్‌మెంటులో 40 ప్లాట్లు ఉన్నాయి. ఇక్కడ కుటుంబాలతో పాటు కార్యాలయాలు నిర్వహిస్తున్నారు. వీరందరినీ ఖాళీ చేయించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. కొంతమంది బయటకు వచ్చినప్పటికీ మరికొందరు ఇంకా ఫ్లాట్లలోనే ఉన్నారు. 15 ఏళ్ల క్రితం ఈ అపార్ట్‌మెంటు నిర్మించారు. ఇలా కూలిపోతున్నందుకు భవంతి వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాణ్యతా లోపం ఇల్లే ఇలా జరిగిందని అధికారులు ప్రాథమికంగా గుర్తించారు.

కుంగిన పిల్లర్లు.. ఇళ్లు ఖాళీ చేసిన యజమానులు
Last Updated : Sep 19, 2019, 9:39 PM IST

For All Latest Updates

TAGGED:

Kakinada

ABOUT THE AUTHOR

...view details