ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

TOP NEWS : ప్రధాన వార్తలు @ 5pm - 5pm top news

.

ప్రధాన వార్తలు @ 5pm
ప్రధాన వార్తలు @ 5pm

By

Published : Dec 10, 2021, 4:59 PM IST

  • Last Rites of CDS: రావత్​ దంపతుల అంతిమ సంస్కారాలు.. ప్రజల వీడ్కోలు
    జనరల్​ బిపిన్​ రావత్​ అంతిమ యాత్ర ప్రారంభమైంది. ఆయన నివాసం నుంచి బార్​ స్క్వేర్​ శ్మశానవాటిక వరకు అంతిమ యాత్ర సాగనుంది. ఆ తర్వాత సైనిక లాంఛనాలతో రావత్​ దంపతుల అంత్యక్రియలు జరగనున్నాయి. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • చాపర్​ క్రాష్​కు ముందు ఏం జరిగింది? వీడియో తీసినవారి మాటల్లో..
    Bipin Rawat helicopter video: భారత త్రిదళాధిపతి బిపిన్​ రావత్​ దంపతులు ప్రయాణిస్తున్న హెలికాప్టర్​ కూలిపోయే కొన్ని క్షణాల ముందు ఏం జరిగింది? చాపర్​ను వీడియో తీసిన వై.జో అనే వ్యక్తిని ఈటీవీ భారత్​ కలవగా.. కీలక విషయాలను వివరించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • Omicron Variant: దేశం​లో మరో ముగ్గురికి ఒమిక్రాన్
    Omicron cases in Gujarat: దేశంలో మరో ముగ్గురికి ఒమిక్రాన్​ నిర్ధరణ అయింది. గుజరాత్​లో ఇద్దరు, ముంబయిలో ఒకరికి వైరస్​ సోకింది. మరోవైపు.. మహారాష్ట్రలోని పుణెలో ఒమిక్రాన్ సోకిన ఏడుగురిలో ఐదుగురు వైరస్​ను జయించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • తూర్పు-పడమర కలిసె.. వివాహ వేడుకలో చంద్రబాబు, దగ్గుబాటి పలకరింపులు
    Chandrababu daggubati Venkateswara rao: హైదరాబాద్‌లో సీనియర్​ ఎన్టీఆర్ మనవరాలి వివాహ వేడుకలో తెదేపా అధినేత చంద్రబాబు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు కలిసి మాట్లాడుకున్నారు. రాజకీయ కారణాలతో వీరిద్దరూ చాలా ఏళ్లుగా మాట్లాడుకోకుండా ఉన్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • Home Minister: 'ఈ-క్రాప్ చేయకపోతే రైతులకు డబ్బులెవరిస్తారు..?'.. హోమంత్రి ఆగ్రహం
    Sucharitha Fire On Agriculture Officers: వ్యవసాయశాఖ అధికారులపై హోమంత్రి మేకతోటి సుచరిత ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ఆమె.. మిర్చికి ఈ-క్రాప్ చేయకపోవటంపై మండిపడ్డారు. ఈ-క్రాప్ చేయకపోతే రైతులకు ఎవరు డబ్బులు ఇస్తారని అధికారులను ప్రశ్నించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • Central Minister on Visakhapatnam Railway Zone : 'దక్షిణకోస్తా రైల్వే జోన్‌ ఏర్పాటుకు చర్యలు చేపట్టాం'
    విశాఖ రైల్వేజోన్‌ కార్యకలాపాలను వెంటనే ప్రారంభిస్తామని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు అంశాన్ని పార్లమెంట్ సమావేశాల్లో తెదేపా ఎంపీలు, వైకాపా సభ్యులు గడిచిన రెండు రోజులుగా లేవనెత్తుతున్నారు. అయితే.. రైల్వే జోన్​పై ఇప్పుడే స్పష్టత ఇవ్వలేమని చెబుతూ వచ్చిన మంత్రి అశ్విని వైష్ణవ్.. తాజాగా చర్యలు చేపడతామని చెప్పడం గమనార్హం. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • AP CID Raids: మాజీ ఐఏఎస్‌ లక్ష్మీనారాయణ ఇంట్లో ఏపీ సీఐడీ సోదాలు
    AP CID Raids: హైదరాబాద్​లోని మాజీ ఐఏఎస్‌ లక్ష్మీనారాయణ ఇంట్లో ఏపీ సీఐడీ సోదాలు చేపట్టింది. చంద్రబాబు ప్రభుత్వంలో సలహాదారుగా పనిచేసిన లక్ష్మీనారాయణ.. నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా సేవలందించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • Stock Market: ఫ్లాట్​గా ముగిసిన స్టాక్ మార్కెట్లు
    Stock Market Today: శుక్రవారం సెషన్​లో స్టాక్ మార్కెట్లు ఒడుదొడుకులను ఎదుర్కొన్నాయి. చివరకు ఫ్లాట్​గా ముగిశాయి. సెన్సెక్స్ 20 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టీ 5 పాయింట్లు పైగా క్షీణించింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • MSK Prasad on Rahane: 'రహానేను అందుకే ఎంపిక చేశారు'
    MSK prasad on Rahane: భారత జట్టు దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా సీనియర్ ఆటగాడు అజింక్య రహానేకు అవకాశం రావడంపై స్పందించాడు మాజీ చీఫ్‌ సెలెక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌. విదేశీ పిచ్‌లపై రహానే మెరుగ్గా రాణించగలడని అన్నాడు. అందుకే సెలెక్టర్లు అతడికి అవకాశం ఇచ్చినట్లు పేర్కొన్నాడు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • Pushpa Movie: ''అఖండ' విజయం మాకు బూస్ట్​ ఇచ్చింది'​
    Pushpa Movie News: లాక్​డౌన్​ తర్వాత విడుదలైన 'అఖండ' చిత్రం భారీ విజయం సాధించి.. తమకు బూస్ట్​ ఇచ్చిందని 'పుష్ప' నిర్మాతలు అన్నారు. ఇక పుష్ప సినిమాలో ది బెస్ట్​ అల్లుఅర్జున్​ను చూస్తారని తెలిపారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

ABOUT THE AUTHOR

...view details