ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

YSR: వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్థంతి.. వైకాపా నాయకుల నివాళి

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 12వ వర్థంతి సందర్భంగా.. వైకాపా నాయకులు తమ పార్టీ కార్యాలయాల్లో ఆయనకు నివాళులర్పించారు. ఈ క్రమంలో వైఎస్​తో తమకున్న అనుబంధాన్ని స్మరించుకున్నారు.

By

Published : Sep 2, 2021, 10:56 AM IST

Updated : Sep 2, 2021, 7:27 PM IST

ysrcp leaders
వైకాపా నాయకుల నివాళి

మాజీ సీఎం రాజశేఖర్​రెడ్డి 12వ వర్థంతి సందర్భంగా.. వైకాపా నాయకులు బొత్స సత్యనారాయణ, అంజాద్ బాష, ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు.. నివాళులర్పించారు. మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్​రెడ్డి ఎందరికో స్ఫూర్తి అని.. ఆయన ప్రవేశపెట్టిన, అమలు చేసిన ఎన్నో సంక్షేమ పథకాలు దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలిచాయని.. పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. విజయనగరంలో వైకాపా శ్రేణులు నిర్వహించిన వైఎస్సార్​ వర్ధంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వెంకటలక్ష్మి కూడలిలో వైఎస్ విగ్రహానికి స్థానిక ప్రజాప్రతినిధులతో కలసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రాజశేఖర్ రెడ్డి మరణం అత్యంత బాధాకరమన్న బొత్స.. నాటి సంఘటన గుర్తుకొస్తే.. ఇప్పటికీ బాధ కలుగుతుందన్నారు.

ప్రజల కోసం సంక్షేమ కార్యక్రమాలు..

దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా.. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. స్థానిక బాలుర ఉన్నత పాఠశాల వద్ద ఉన్న వైఎస్ విగ్రహానికి ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పూలమాలలువేసి అంజలి ఘటించారు. ముఖ్యమంత్రిగా వైఎస్ రాష్ట్ర ప్రజలకు అందించిన సంక్షేమ కార్యక్రమాలను గుర్తు చేసుకున్నారు.

రాజశేఖర్ రెడ్డి పాలను తలపిస్తున్న జగన్ పాలన..

వైఎస్ రాజశేఖర్ రెడ్డి అడుగుజాడల్లో నడుస్తూ రాష్ట్ర అభివృద్ధికి జగన్మోహన్ రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారని ఉపముఖ్యమంత్రి అంజాద్ బాష అన్నారు. నేడు వైఎస్. రాజశేఖర్ రెడ్డి 12 వర్ధంతిని పురస్కరించుకొని కడప ప్రధాన తపాలా కార్యాలయం వద్ద ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి, మేయర్ సురేష్ బాబుతో కలిసి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. జగన్ మోహన్ రెడ్డి పాలన రాజశేఖర్ రెడ్డి పాలన తలపిస్తోందని పేర్కొన్నారు. రాజశేఖర్​రెడ్డి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని, ఆయన లేకున్నా ఆయన మంచి పనులు ప్రజలమధ్య ఉన్నాయని పేర్కొన్నారు.

చిరునవ్వునే పేదోడికి సంజీవనిగా..

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 12 వ వర్ధంతి సందర్భంగా... శ్రీకాకుళం నగరంలో ఏడురోడ్ల కూడలిలో గల ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆరోగ్య శ్రీ పథకంతో తన చిరునవ్వునే పేదోడికి సంజీవనిగా మార్చిన మహనీయుడు వైఎస్ ధర్మాన కొనియాడారు. ఫీజురీయింబ‌ర్స్‌మెంట్ ప‌థ‌కంతో పేద విద్యార్థులను.. ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దారు. కార్యక్రమంలో వైస్ ఆర్ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

మహిళ కార్మికులకు చీరల పంపిణీ..

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి కార్యక్రమాన్ని కర్నూలులో నిర్వహించారు. నగరంలోని శరీన్ నగర్ లో వైఎస్ఆర్ విగ్రహానికి నగర మేయర్ బీ వై రామయ్య, ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సంక్షేమ పథకాలు ఎక్కువగా ప్రజలకు అందించిన ఘనత వైఎస్ రాజశేఖర్ రెడ్డికే చెందిందని ఎమ్మెల్యే కాటసాని కొనియాడారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య మహిళ కార్మికులకు చీరల పంపిణీ చేశారు.

నాయకుల నివాళి..

వైఎస్ ఆర్ చూపిన బాటలో.. నేడు వైఎస్ జగన్ పాలన సాగుతోందని.. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కొనియాడారు. ఎన్నికల్లో చెప్పినవన్ని సీఎం జగన్ ఆచరణలో చేసి చూపుతున్నారని అన్నారు. తాడేపల్లి లోని వైకాపా కేంద్ర కార్యాలయంలో జరిగిన వైఎస్ ఆర్ వర్ధంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆయనతో పాటు మంత్రులు సీదిరి అప్పలరాజు, కన్నబాబు, పలువురు ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు వైకాపా నేతలు పాల్గొని మహ నేతకు నివాళులర్పించారు.

భావోద్వేగానికి లోనైన మంత్రి ..

కర్నూలు జిల్లా ఆలూరు మండలంలో.. నేడు వైయస్ రాజశేఖర్ రెడ్డి 12వ వర్ధంతి కార్యక్రమంలో మంత్రి గుమ్మనూరు జయరాం పాల్గొన్నారు. ఈ క్రమంలో వైఎస్ ను స్మరించుకుంటూ ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. ప్రజలకు ఎంతో సేవ చేసిన వ్యక్తి వైఎస్ అని మంత్రి కొనియాడారు. సమావేశ అనంతరం ఆలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు.

ప్రజలకు ఎనలేని సేవలందించారు..

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస పట్టణంలో వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలవేసి స్పీకర్ తమ్మినేని సీతారాం నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికి ప్రజలకు ఎనలేని సేవలను సేవలందించిన మహా నాయకుడు వైయస్ రాజశేఖర్ రెడ్డిని తమ్మినేని అన్నారు. ఆయన చేసిన సేవల కారణంగా.. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని తెలిపారు.

ఇదీ చదవండీ..YSR VARDHANTHI: ఇడుపులపాయలో వైఎస్‌ఆర్​కు సీఎం జగన్‌, కుటుంబసభ్యుల నివాళి

Last Updated : Sep 2, 2021, 7:27 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details