ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వైఎస్ కుటుంబసభ్యులను సిట్ విచారణ - speed

జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం వేగం పెంచింది. తమకున్న అనుమానాలు తీర్చుకోవడానికి ఇవాళ వైఎస్ కుటుంబ సభ్యులను విచారించింది. హత్య జరిగిన ప్రదేశమైన వివేకా గృహంలో మరోసారి తనిఖీలు చేసింది

వివేకానందరెడ్డి హత్యపై దర్యాప్తు

By

Published : Mar 17, 2019, 8:40 PM IST

దర్యాప్తు వేగవంతం
మాజీమంత్రి వై.ఎస్. వివేకానందరెడ్డి హత్య కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరమైంది. ఈ కేసులో వివరాలు తెలుసు కునేందుకు సిట్ అధికారులు వై.ఎస్.కుటుంబ సభ్యులను విచారిస్తున్నారు. పులివెందుల డీఎస్పీ కార్యాలయంలో విచారణ నిర్వహించారు. మాజీఎంపీ వై.ఎస్.అవినాశ్ రెడ్డి తండ్రి వై.ఎస్.భాస్కర్ రెడ్డి, వై.ఎస్. మనోహర్ రెడ్డి, వై.ఎస్.ప్రతాప్ రెడ్డి, దొండ్లవాగు శంకర్ రెడ్డి లను సిట్ అధికారులు విచారించారు. వీరితోపాటు సిట్ బృందం ఇవాళ మరోసారి వివేకానందరెడ్డి నివాసాన్ని పరిశీలించింది. వివేకా కూతురు సునీత, అల్లుడు రాజశేఖర్ రెడ్డి, బావమరిది ప్రకాశ్ రెడ్డిలను విచారించారు. ఈ హత్య కేసుకు సంబంధించి పోలీసులకున్న అనుమానాలను నివృత్తి చేసుకోవడానికి వై.ఎస్.కుటుంబ సభ్యులను ప్రశ్నించారు. గురువారం అర్ధరాత్రి వివేకాతో ఏమైనా మంతనాలు జరిపారా... కుటుంబ సభ్యుల మధ్య గొడవలు ఉన్నాయా అనే కోణంలో ప్రశ్నించినట్లు సమాచారం. డీఎస్పీ కార్యాలయంలో పోలీసులు విచారణ తర్వాత కుటుంబ సభ్యులు వెళ్లిపోయారు. ఇప్పటికే ఈ కేసులో ఆరుగురిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. వివేకా కారు డ్రైవర్ ప్రసాద్, పీఏ కృష్ణారెడ్డి, పనిమనిషి లక్ష్మీ, వివేకా ముఖ్య అనుచరుడు ఎర్ర గంగిరెడ్డితోపాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details