రాష్ట్ర వ్యాప్తంగా భవన నిర్మాణ కార్మికుల ధర్నా - darna
రాష్ట్ర వ్యాప్తంగా భవన నిర్మాణ కార్మికుల ధర్నా చేపట్టారు. నూతన ఇసుక విధానాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆందోళనలతో పలు చోట్ల ట్రాఫిక్ నిలిచిపోయింది.
రాష్ట్రంలో పలుచోట్ల భవన నిర్మాణ కార్మికులు ఆందోళనలు చేపట్టారు. ఇసుక రవాణాను రాష్ట్ర ప్రభుత్వం నిషేంధిచడంతో పనులు లేక కార్మికులు ఉపాధి కోల్పోతున్నారన్నారు. భవన కార్మికులు భారీ ర్యాలీలు నిర్వహించారు. వెంటనే ప్రభుత్వం ఇసుక రవాణా పునరుద్ధరించాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నిరసనల వల్ల ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. కడప జిల్లా, ప్రకాశం జిల్లాలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో భవన కార్మికులు ఆందోళనలకు దిగారు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ప్రభుత్వ, పైవేటు భవనాలు అర్ధాంతరంగా ఆగిపోవడంతో గుత్తేదారులు ఆందోళన చెందుతున్నారు.