ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

గంజాయి, గుట్కా కేసుల్లో పట్టుబడితే పీడీయాక్ట్ నమోదు - గంజాయి, గుట్కా కేసులు

నేడు కడప జిల్లా వ్యాప్తంగా 6 గంజాయి కేసులు నమోదు చేశామని ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. గంజాయి, గుట్కా కేసుల్లో పదేపదే పట్టుబడితే వారిపై పీడీయాక్ట్ నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు.

గంజాయి, గుట్కా కేసుల్లో పట్టుబడితే పీడీయాక్ట్ నమోదు
గంజాయి, గుట్కా కేసుల్లో పట్టుబడితే పీడీయాక్ట్ నమోదు

By

Published : Nov 8, 2021, 11:07 PM IST

గంజాయి, గుట్కా కేసుల్లో పదేపదే పట్టుబడితే వారిపై పీడీయాక్ట్ నమోదు చేస్తామని కడప జిల్లా పోలీసు అధికారి అన్బురాజన్ హెచ్చరించారు. కడప నగర పరిధిలో గంజాయి, గుట్కా విక్రయించే వారికి కడప డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ కౌన్సిలింగ్ చేపట్టారు. ఈరోజు ఒక్కరోజు కడప జిల్లా వ్యాప్తంగా 6 గంజాయి కేసులు నమోదు చేశామని ఎస్పీ తెలిపారు.

తూర్పు గోదావరి జిల్లా మోతుగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలోని గొడ్లగూడెం వద్ద వెయ్యి కేజీల గంజాయి పట్టుకున్నారు. ఒడిశా నుంచి లారీలో పశు దాణా చాటున గంజాయి తరలిస్తున్నారు. ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు. ఉత్తర్ ప్రదేశ్ లోని వారణాసికి గంజాయి తరలిస్తుండగా మోతుగూడెం పోలీసులు వాహన తనిఖీల్లో గంజాయి లారీని పట్టుకున్నారు.

గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని నెల్లూరు జిల్లా ఎస్పీ విజయ రావు ఆదేశాలు ఇచ్చారు. జిల్లాలోని బస్టాండ్, రైల్వే స్టేషన్, టోల్ ప్లాజాల వద్ద అణువణువు, ముమ్మరంగా ఆకస్మిక తనిఖీలు చేశారు.

ఆపరేషన్ పరివర్తనలో భాగంగా జిల్లాలో మాదకద్రవ్యాల అక్రమ రవాణా నిరోదానికి దాడులు ప్రారంభించారు. నెల్లూరు నగరంలోని మెయిన్ బస్టాండ్, రైల్వే స్టేషన్, ఆత్మకూరు బస్టాండ్ మరియు వెంకటాచలం టోల్ ప్లాజాలలో తనిఖీలు చేశారు.

ఈ వారం రోజుల తనిఖీలలో 200 కేజీల గంజాయి స్వాధీనం, 20 మంది ముద్దాయిలు అరెస్ట్ చేశారు. నిన్న ఒక్క రోజే రెండు కేసులలో రెండన్నర కేజీల గంజాయి స్వాధీనం, ఇద్దరు ముద్దాయిలు అరెస్ట్ చేశారు.

ఇదీ చదవండి:nellore corporation : నెల్లూరు నగరపాలికలో 8 డివిజన్లు ఏకగ్రీవం

ABOUT THE AUTHOR

...view details