ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

బీమా పరిహారాన్ని మంజూరు చేయండి: ఎంపీ అవినాశ్ రెడ్డి - Kadapa MP

రైతులకు అందాల్సిన బీమా పరిహారాన్ని తక్షణం మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని... కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్​ను కడప ఎంపీ అవినాశ్ రెడ్డి కోరారు.

బీమా పరిహారాన్ని మంజూరు చేయండి: అవినాశ్ రెడ్డి

By

Published : Jul 24, 2019, 11:06 PM IST

బీమా పరిహారాన్ని మంజూరు చేయండి: అవినాశ్ రెడ్డి

కడప జిల్లాలోని శనగ పంట రైతులకు రావాల్సిన బీమా పరిహారాన్ని తక్షణం మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని... కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్​ను ఎంపీ అవినాశ్ రెడ్డి కోరారు. 2012 - 13 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన శనగ పంటల బీమా పరిహారం పెండింగ్​లో ఉన్న విషయాన్ని అవినాశ్ రెడ్డి... కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. రైతుల పరిస్థితిని వివరించారు. ప్రీమియం చెల్లించిన ప్రతి రైతుకు బీమా పరిహారం అందే విధంగా... ఏఐసీ సంస్థకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఈ విజ్ఞప్తికి కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. జిల్లాకు 2012 - 13 సంవత్సరానికి సంబంధించి శనగ పంటల బీమా పరిహారం సుమారు రూ.112 కోట్లు విడుదల కావాల్సి ఉంది.

ABOUT THE AUTHOR

...view details