ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మదర్సాలలోనూ ఆంగ్లమాధ్యమం : అంజాద్ బాషా

ఉత్తర్​ప్రదేశ్, అసోం రాష్ట్రాల తరహాలో ఏపీలోనూ మదర్సా బోర్డు ఏర్పాటుచేయాల్సిన అవసరముందని ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా అన్నారు. అందుకనుగుణంగా ప్రభుత్వం ఆలోచన చేస్తుందని ఆయన అన్నారు.

By

Published : Nov 27, 2019, 6:27 AM IST

Minister amzad basha on madarsha board in ap
రాష్ట్రంలో మదర్సా బోర్డు ఏర్పాటు : అంజాద్ బాషా


రాష్ట్రంలో మదర్సా బోర్డు ఏర్పాటుపై ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా సమీక్ష నిర్వహించారు. ఉత్తర్​ప్రదేశ్‌, అసోం రాష్ట్రాల తరహాలోనే ఏపీలోనూ మదర్సా బోర్డు ఏర్పాటు చేయాల్సిన అవసరముందన్నదే ప్రభుత్వ ఆలోచన అని ఆయన స్పష్టం చేశారు. ఇందులో భాగంగా రాష్ట్రానికి చెందిన ముస్లిం ప్రజాప్రతినిధులు, మైనారిటీ సంక్షేమశాఖ ఉన్నతాధికారుల బృందం యూపీ, అసోం రాష్ట్రాల్లో పర్యటించనుంది. ఆయా రాష్ట్రాల్లో మదర్సా బోర్డుల ఏర్పాటు, నిర్వహణను బృందం సభ్యులు పరిశీలించనున్నారు. మదర్సాల్లో ఇస్లామిక్‌ చదువుతో పాటు ఆంగ్ల మాధ్యమం, ఆధునిక సాంకేతిక విద్యపై కూడా బోధన ఉండేలా చర్యలు చేపట్టనున్నారు. మదర్సాల్లోని విద్యార్థులకూ అమ్మఒడి పథకం వర్తింపజేసేలా కార్యాచరణ చేపట్టనున్నారు.

ABOUT THE AUTHOR

...view details