ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వివేకా హత్యలో నా ప్రమేయం ఉంటే ఉరితీయండి! - వైఎస్ సునీతారెడ్డి

వైఎస్ వివేకా హత్య కేసులో తమపై వస్తున్న ఆరోపణల మీద.. మంత్రి ఆదినారాయణరెడ్డి తీవ్రంగా స్పందించారు. హత్యలో తన పాత్ర ఉంటే బహిరంగంగా ఉరితీయాలని సవాల్ విసిరారు.

మంత్రి ఆదినారాయణరెడ్డి

By

Published : Mar 27, 2019, 2:31 PM IST

మంత్రి ఆదినారాయణరెడ్డి
వైఎస్ వివేకా హత్య కేసులో తమపై వస్తున్న ఆరోపణల మీద.. మంత్రి ఆదినారాయణరెడ్డి తీవ్రంగా స్పందించారు. ఈ హత్య వెనక ఎవరున్నారన్నది.. రాష్ట్ర ప్రజలకు.. ముఖ్యంగా కడపలో ప్రతి చిన్నపిల్లాడికీ తెలుసని అన్నారు. ముందు గుండెపోటుగా ప్రచారం చేసి.. తర్వాత హత్య అని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు.ఈ కేసులో నిజాలు వెల్లడైతే జగన్‌ బండారం బయటపడుతుందని స్పష్టం చేశారు. నిజాలు తొక్కిపెట్టేందుకే ఐపీఎస్‌ అధికారులను బదిలీ చేయించారని ఆరోపించారు. వివేకా కూతురు తనపై ఆరోపణలు చేయడం సరికాదన్న మంత్రి...హత్యలో తన పాత్ర ఉంటే బహిరంగంగా ఉరితీయాలని సవాల్ విసిరారు. అదే సమయంలో...జగన్‌ కుటుంబసభ్యుల పాత్ర బయటపడితే.. రాజకీయాలు చాలిస్తారా అని ప్రశ్నించారు.

ABOUT THE AUTHOR

...view details