ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Central team visit in Kadapa: నేడు కడప జిల్లాలో కేంద్ర బృందం పర్యటన.. నష్ట తీవ్రతపై ఆరా - Kadapa district latest news

కడప జిల్లాలో(Central team visit in Kadapa district) నేడు కేంద్ర బృందం పర్యటించనుంది. రాజంపేట, నందలూరు మండలాల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో నష్ట తీవ్రతను అంచనా వేయనుంది. అనంతరం బుగ్గవంక, కమలాపురం వద్ద కూలిపోయిన పాపాగ్నినది వంతెనను కేంద్ర బృందం పరిశీలిస్తుందని కలెక్టర్ విజయరామరాజు తెలిపారు.

Central team visits Kadapa district today
నేడు కడప జిల్లాలో కేంద్ర బృందం పర్యటన

By

Published : Nov 27, 2021, 3:56 AM IST

Central team visits Kadapa district: కడప జిల్లాలో వరదల బీభత్సానికి తీవ్రంగా నష్టపోయి, ఆస్తులు, ఆప్తులను కోల్పోయిన రాజంపేట, నందలూరు మండలాల్లో నేడు(శనివారం) కేంద్ర బృందం పర్యటించనుంది. తిరుపతి నుంచి నేరుగా రాజంపేట చేరుకోనున్న కేంద్ర బృందం సభ్యులు... అక్కడి నుంచి వరద ప్రభావిత ప్రాంతాలైన మందపల్లె, పులపుత్తూరు, గుండ్లూరు, తోగూరుపేట గ్రామాల్లో పర్యటించి వరద నష్టాన్ని అంచనా(Central team on floods damage in Kadapa district) వేయనున్నారు. వరదల్లో మృతిచెందిన, గల్లంతైన వారి కుటుంబాలతో మాట్లాడి వివరాలు సేకరించనున్నారు.

అనంతరం కడపకు చేరుకుని బుగ్గవంకను పరిశీలన చేయడంతోపాటు కమలాపురం వద్ద కూలిపోయిన పాపాగ్నినది వంతెనను కేంద్ర బృందం పరిశీలిస్తుందని కలెక్టర్ విజయరామరాజు తెలిపారు. అన్నమయ్య ప్రాజెక్టు, చెయ్యేరు, పాపాగ్ని, పెన్నా.. నదుల వరద ఉద్ధృతి కారణంగా... పంటలు, నిర్మాణాల మొత్తం దాదాపు రూ. 140 కోట్ల ఆస్తి నష్టం జరిగిందని కలెక్టర్ పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details