వైఎస్ వివేకా హత్యకేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులకు కడపలో కేటాయించిన గెస్ట్ హౌస్‌లో గదులు ఖాళీ చేయాలని జిల్లా ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రావడం చర్చనీయాంశమైంది. ఏడాదిన్నర నుంచి సీబీఐ అధికారులు ఆర్ అండ్ బి అతిథి గృహంలో 3 గదులను అద్దెకు తీసుకుని ఉంటున్నారు. రాత్రి వేళల్లో అక్కడే బస చేస్తున్న అధికారులు.. ఉదయం దర్యాప్తులో భాగంగా కడప కేంద్ర కారాగారం అతిథి గృహానికి, పులివెందుల ఆర్ అండ్ బి అతిథి గృహానికి వెళ్లి వస్తుంటారు. రాత్రికి మాత్రం కడప ఆర్ అండ్ బి అతిథి గృహంలో బస చేస్తున్నారు. అయితే తాజాగా ఆర్ అండ్ బి అతిథి గృహంలో సీబీఐ అధికారులు తీసుకున్న గదులను ఖాళీ చేయాలని జిల్లా రెవెన్యూ అధికారుల నుంచి ఆదేశాలు అందాయి.
గెస్ట్‌హౌస్ ఖాళీ చేయండి.. సీబీఐ అధికారులకు ఆదేశం... కారణం ఏంటంటే..! - కడప లేటెస్ట్ అప్డేట్స్
Kadapa guest house: సీబీఐ కడప గెస్ట్ హౌస్‌లో ఉంటూ వివేకా హత్యకేసును దర్యాప్తు చేస్తున్నారు. గెస్ట్ హౌస్ గదులు ఖాళీ చేయాలని సీబీఐ అధికారులకు జిల్లా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఒంటిమిట్ట శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల సందర్భంగా జిల్లాకు సీఎం జగన్ రానున్న నేపథ్యంలో సీఎం గెస్ట్ హౌస్‌లో బస చేసే వీలున్నందున ఖాళీ చేయాలని ఆదేశించినట్లు తెలిపారు.
ఒంటిమిట్ట శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల సందర్భంగా సీఎం జగన్ జిల్లాకు రానున్నారు. స్వామి వారి కల్యాణాన్ని తిలకించిన తర్వాత సీఎం కడప గెస్ట్ హౌస్‌లో బస చేసే వీలుంది. అందుకనుగుణంగానే ఆర్ అండ్ బి అతిథి గృహాన్ని ఖాళీ చేయించాలని.. జాయింట్ కలెక్టర్ నుంచి ఉన్నతాధికారులకు ఆదేశాలు అందాయి. ప్రస్తుతం గెస్ట్ హౌస్‌లో ఉన్న సీబీఐ అధికారులనూ గదులు ఖాళీ చేసి వెళ్లి పోవాలని అధికారులు తెలియజేసినట్లు సమాచారం. రెండురోజుల్లో వారు గెస్ట్ హౌస్ ఖాళీ చేసే వీలుందని సమాచారం.
ఇదీ చదవండి:'రహదారులపై విగ్రహాల తొలగింపులో వివక్షా ?.. మేం జోక్యం చేసుకునే పరిస్థితి తేవొద్దు'
TAGGED:
Kadapa latest updates