ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

viveka murder case: వివేకా కేసు.. కడప, పులివెందులలో అనుమానితుల విచారణ

వైఎస్ వివేకా హత్య కేసు (Viveka murder case)లో సీబీఐ (CBI) దర్యాప్తు 68వ రోజు కొనసాగుతోంది. కడప, పులివెందులలో పలువురు అనుమానితులను సీబీఐ అధికారులు విచారణ చేస్తున్నారు.

viveka murder case
వైఎస్ వివేకా హత్య కేసు

By

Published : Aug 13, 2021, 11:45 AM IST

Updated : Aug 13, 2021, 5:38 PM IST

మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో 68 రోజు సీబీఐ విచారణ కొనసాగుతోంది. కడప, పులివెందుల ప్రాంతాల్లో రెండు బృందాలుగా విడిపోయిన అధికారులు అనుమానితులను ప్రశ్నిస్తున్నారు. ఇవాళ పులివెందుల ఆర్ అండ్ బి అతిథి గృహంలో వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఉమా శంకర్​రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్​రెడ్డి సీబీఐ విచారణకు హాజరయ్యారు. ఇతను ఎంపీ అవినాష్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు కావడంతోపాటు కేసులో కీలక అనుమానితులుగా ఉన్నాడు.

పులివెందుల క్యాంపు కార్యాలయంలో పనిచేసే రఘునాథ్ రెడ్డిని కూడా ప్రశ్నిస్తున్నారు. కడపలో కూడా మరో నలుగురు అనుమానితులను సీబీఐ అధికారులు విచారణ చేస్తున్నారు. వివేకా కారు డ్రైవర్ దస్తగిరిని సీబీఐ అధికారులు.. నిన్న రాత్రి నుంచి విచారణ చేస్తున్నారు. కస్టడీలో ఉన్న సునీల్ యాదవ్‌పై విచారణ కొనసాగుతోంది. అతని బంధువు భరత్ యాదవ్‌ను కూడా నేడు ప్రశ్నిస్తున్నారు. సునీల్‌ను కలిసేందుకు అతని తల్లి సావిత్రి, భార్య లక్ష్మి కడప కేంద్ర కారాగారానికి వచ్చారు. సాయంత్రం కొందరు అనుమానితులను సీబీఐ అధికారులు పులివెందులలో విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

దేవిరెడ్డివిచారణ పూర్తి..

పులివెందులలో దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి విచారణ పూర్తైంది. శివశంకర్‌రెడ్డిని సీబీఐ అధికారులు 7 గంటలపాటు ప్రశ్నించారు. కొమ్మా పరమేశ్వర్‌రెడ్డి విచారణ ఇంకా కొనసాగుతూనే ఉంది.

ఇదీ చదవండి:

TDP: బ్లాంక్ జీవోల వ్యవహారంపై గవర్నర్​కు ఫిర్యాదు చేయనున్న తెదేపా నేతలు

Last Updated : Aug 13, 2021, 5:38 PM IST

ABOUT THE AUTHOR

...view details