Case filed on Approver Dasthagiri: వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా ఉన్న డ్రైవర్ దస్తగిరిపై కేసు నమోదైంది. వైఎస్ఆర్ జిల్లా తొండూరు వాసి పెద్దగోపాల్‌తో జరిగిన వివాదమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. దస్తగిరి సోదరుడు మస్తాన్‌పై పెద్దగోపాల్ కేసు పెట్టాడు. ఈ విషయంపై గోపాల్, దస్తగిరికి మధ్య వాగ్వాదం జరిగింది. మాటామాటా పెరగడంతో తొండూరు పీఎస్‌లోనే తనపై చేయి చేసుకున్నట్లు పెద్దగోపాల్ ఫిర్యాదు చేశాడు. అంతేకాకుండా తనను చంపుతానని కూడా బెదిరించాడని పేర్కొన్నాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు తొండూరు పోలీసులు దస్తగిరిపై కేసు నమోదు చేశారు.
Driver Dastagiri: డ్రైవర్ దస్తగిరిపై పోలీసు కేసు.. ఎందుకంటే..! - Case filed on Approver Dasthagiri
Case filed on Approver Dasthagiri: తనను చంపుతానని దస్తగిరి బెదిరించాడని ఓ వ్యక్తి తొండూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు వైఎస్ వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా ఉన్న డ్రైవర్ దస్తగిరిపై కేసు నమోదు చేశారు.
Case filed on Approver Dasthagiri