కడప జిల్లా పులివెందులలో జర్మనీ సహకారంతో ఆగ్రో ఎకోలాజికల్ రీసెర్చ్ సెంటర్(AGRO ECOLOGICAL RESEARCH CENTER AT PULIVENDULA) ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు(MINISTER KANNABABU) తెలిపారు. వ్యవసాయ రంగంలో మరింత లోతైన పరిశోధన, సిబ్బందికి సాంకేతిక శిక్షణ కోసం.. ఈ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన వివరించారు. పరిశోధనా కేంద్రం ఏర్పాటు కోసం జర్మనీ రూ. 170 కోట్ల గ్రాంటును అందించనున్నట్లు వెల్లడించారు. ప్రకృతి వ్యవసాయానికి ప్రాధాన్యత ఇచ్చేలా ఈ పరిశోధనా, శిక్షణా కేంద్రం పని చేయనుందని స్పష్టం చేశారు. దీని ఏర్పాటుకు సంబంధించి జర్మనీ(GERMANY)కి చెందిన కెడబ్ల్యూఎఫ్ బ్యాంకు ప్రతినిధులు మంత్రితో సమావేశమై వివిధ అంశాలను చర్చించారు.
RESEARCH CENTER: పులివెందులలో ఆగ్రో ఎకలాజికల్ పరిశోధన కేంద్రం: కన్నబాబు - ఆగ్రో ఎకోలాజికల్ రీసెర్చ్ సెంటర్
సీఎం సొంతజిల్లాలోని పులివెందులలో ఆగ్రో ఎకలాజికల్ పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి(MINISTER KANNABABU) తెలిపారు. దీనికి జర్మన్ బ్యాంకు గ్రాంటు అందిస్తున్నట్లు తెలిపారు.
RESEARCH CENTER