Man Missing In Kadapa Flood : నా భర్త జాడేది..?? - కడప వరదలు
కడప జిల్లాలో వారం రోజుల కిందట సంభవించిన వరదల్లో అనేక మంది గల్లంతయ్యారు. పలువురు మృత్యువాత పడ్డారు. రాజంపేటకు చెందిన శివ ప్రసాద్ అనే వ్యక్తి నందలూరు వద్ద బస్సులో ప్రయాణిస్తూ వరదల్లో(Siva Prasad missed in Kadapa flood) గల్లంతయ్యారు. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో అసిస్టెంట్ మేనేజర్ గా ఆయన పని చేస్తున్నాడు. వారం రోజుల నుంచి శివప్రసాద్ కోసం కుటుంబ సభ్యులు వెతికినా ఆచూకీ దొరకలేదు . 3 నెలల గర్భవతి అయిన శివప్రసాద్ భార్య జ్యోతి ఆవేదన వర్ణనాతీతం. శివప్రసాద్ ఇంటి నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి మురళి అందిస్తారు..
నా భర్త జాడేది..??