ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రైవేటు పాఠశాలకు రూ.25 వేల జరిమానా

అడ్మిషన్ల కోసం అర్హత పరీక్ష నిర్వహిస్తున్న ఓ ప్రైవేట్ పాఠశాలకు కడప విద్యాశాఖ అధికారి 25 వేల రూపాయలు జరిమానా విధించారు. కడపలో నాగార్జున మోడల్ స్కూల్ యాజమాన్యం తమ పాఠశాలలో చేరే విద్యార్థులకు అర్హత పరీక్షలు నిర్వహించారు. వేసవి సెలవులు ముగియక ముందే పరీక్షలు తగవని... ఇలాంటి చట్టవ్యతిరేక పనులకు ఎవరైనా పాల్పడితే జరిమానా విధిస్తామని హెచ్చరించారు.

By

Published : May 10, 2019, 6:36 PM IST

ప్రైవేటు పాఠశాలకు 25 వేల జరిమానా

ప్రైవేటు పాఠశాలకు 25 వేల జరిమానా

కడపలోని ఓ ప్రైవేట్​ పాఠశాలకు జిల్లా విద్యాశాఖాధికారి 25వేల రూపాయలు జరిమానా విధించారు. అడ్మిషన్ల కోసం అర్హత పరీక్ష నిర్వహిస్తున్న నాగార్జున మోడల్​ స్కూల్​ యాజమాన్య నిర్వాకానికి విద్యార్థి సంఘాలు... కళాశాల వద్ద ఆందోళనలు చేశారు. విద్యాశాఖాధికారికి వినతిపత్రాన్ని అందచేశారు. వేసవి సెలవులు ముగియకముందే అడ్మిషన్ల కోసం అర్హత పరీక్ష నిర్వహించడం సమంజసం కాదని నాగార్జున మోడల్​ స్కూల్​ యాజమాన్యంపై కన్నెర్ర చేశారు. ఎవరైనా ఇలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే జరిమానా విధిస్తామని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details