ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తల్లితో వివాహేతర సంబంధం.. వ్యక్తి మర్మంగాలు కోసేసిన కుమార్తె - గుంటూరు జిల్లా తాజా నేర వార్తలు

Secret parts cut: ఓ వైపు మద్యం మత్తు చాలా మంది జీవితాలను చిన్నాభిన్నం చేస్తోంది.. మరోవైపు వివాహేతర సంబంధాలు కుంటుంబాలను కుదిపేస్తున్నాయి.. ఇటీవల కాలంలో వివాహేతర సంబంధాల వల్ల హత్యలు, ఆత్మహత్యలు ఎక్కువగా జరుగుతున్నాయి... ఇవి దంపతుల జీవితాలనే కాదు... పిల్లల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి... తాజాగా తల్లితో వివాహేతరం సంబంధం పెట్టుకున్న వ్యక్తి మర్మంగాలను కుమార్తె కోసేసిన దారుణ ఘటనే ఇందుకు నిదర్శనం.

young woman cut the man secret parts
తెనాలిలో వ్యక్తి మర్మంగాలు కోసిన యువతి

By

Published : May 3, 2022, 9:08 AM IST

Updated : May 3, 2022, 12:34 PM IST

Illegal Affair: వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని అతని మర్మంగం కోసిన ‌ఘటన.. సోమవారం రాత్రి గుంటూరు జిల్లా తెనాలిలో జరిగింది. బాపట్ల జిల్లాకి చెందిన రామచంద్రారెడ్డి రెండేళ్ల క్రితం తెనాలి వచ్చాడు. అతనికి ఐతానగర్‌కి చెందిన సంధ్య అనే మహిళతో వివాహేతర సంబంధం ఉంది. కూలీపని చేసుకునే రామచంద్రరెడ్డి లాడ్జిలో నివాసం ఉంటున్నాడు. సోమవారం రాత్రి సంధ్యతో కలిసి మద్యం సేవించి ఆమె నివాసం ఉండే భవనంపై నిద్రస్తున్నారు. అదే సమయంలో సంధ్య కుమార్తె, మరో యువకుడు భవనంపైకి వచ్చి రామచంద్రారెడ్డితో గొడవపడ్డారు. ఈ నేపథ్యంలో అతని మర్మాంగాన్ని కోసేశారు. బాధితుడి కేకలు విన్న స్థానికులు అతడ్ని ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం గుంటూరుకు తరలించారు

ఇదీ చదవండి: మద్యం మత్తులోనే మహిళలపై దుశ్చర్యలు..!

Last Updated : May 3, 2022, 12:34 PM IST

ABOUT THE AUTHOR

...view details