ఆంధ్రప్రదేశ్

andhra pradesh

కొవిడ్ కేంద్రాల్లో యోగా తరగతులు

కరోనా బాధితులకు సాంత్వన చేకూర్చేందుకు గుంటూరు జిల్లా అధికారులు కొవిడ్ కేంద్రాల్లో యోగా తరగతులు నిర్వహిస్తున్నారు. యోగాసనాల ద్వారా శ్వాస ప్రక్రియలో అవాంతరాలు తొలగించటం ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యం.

By

Published : Oct 7, 2020, 7:15 PM IST

Published : Oct 7, 2020, 7:15 PM IST

Yoga Programs in Covid Centers
కొవిడ్ కేంద్రాల్లో యోగా తరగతులు..!

కరోనా రోగులకు త్వరగా సాంత్వన కలిగించేందుకు గుంటూరు జిల్లా అధికారులు కొవిడ్ కేంద్రాల్లో యోగా తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రముఖ యోగా గురువు పతంజలి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. నరసరావుపేటలోని కొవిడ్ కేంద్రంలో బాధితులకు వారం రోజులుగా నిర్వహించిన తరగతులు ఇవాళ ముగిశాయి. వైరస్ బారినపడిన వారిలో యోగాసనాన ద్వారా శ్వాస ప్రక్రియలో అవాంతరాలు తొలగించటం ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యం.

ఒంటరితనం పొగొట్టి బాధితుల్లో ధైర్యం నింపటం సైతం ఈ కార్యక్రమ మరో ఉధ్దేశం. అంతా కలిసి కరోనాని సమర్థంగా తిప్పికొట్టేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయని ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. జిల్లాలోని అన్ని కొవిడ్ కేంద్రాల్లోనూ యోగా తరగతులు విడతల వారీగా నిర్వహిస్తున్నామని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details