ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

గుంటూరుకు చెందిన ప్రవాసాంధ్రుడికి అరుదైన అవకాశం

ఏపీ నాన్ రెసిండెంట్ తెలుగు సొసైటీ అమెరికా రీజినల్ కో-ఆర్డినేటర్​గా గుంటూరు నగరానికి చెందిన ప్రవాసాంధ్రుడు యర్రబోతుల శ్రీనివాస రెడ్డి నియమితులయ్యారు. తన నియామకానికి కృషి చేసిన సీఎం జగన్​కు శ్రీనివాస రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

By

Published : Jan 10, 2021, 3:37 PM IST

apnrts america coordinator
ప్రవాసాంధ్రుడు యర్రబోతుల శ్రీనివాస్ రెడ్డి

గుంటూరు జిల్లాకు చెందిన ప్రవాసాంధ్రుడు యర్రబోతుల శ్రీనివాస రెడ్డి.. ఏపీ నాన్‌ రెసిడెంట్ తెలుగు సొసైటీ(ఏపీఎన్​ఆర్​టీఎస్) అమెరికా రీజనల్ కో-ఆర్డినేటర్‌గా నియమితులయ్యారు. ఏపీఎన్​ఆర్​టీఎస్​కు అమెరికా ప్రాంతీయ సమన్వయకర్తగా తనను నియమించడంపై శ్రీనివాస రెడ్డి... సీఎం జగన్​కు కృతజ్ఞతలు తెలిపారు. ఏపీ ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఇండస్ట్రీ పాలసీ ప్రచారానికి కృషి చేస్తానని తెలిపారు. ఏపీలో పెట్టుబడులకు తన వంతు సహకారం అందిస్తానని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details