గుంటూరు నగరంలో మహిళపై అత్యాచారయత్నం కలకలం రేపింది. ఒడిశాకు చెందిన ఓ మహిళను కొందరు దుండగులు ద్విచక్రవాహనంపై బలవంతంగా పేరిచర్లకు తీసుకెళ్లి... రేప్ చేసేందుకు యత్నించారు. మహిళ కేకలు విన్న స్థానికులు పోలీసులకు ఫోన్ చేశారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకునే లోపే దుండగులు పారిపోయారు. బాధితురాలికి గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఆమె కుటుంబసభ్యులు ఫిర్యాదు మేరకు లాలాపేట పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనలో దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. త్వరలోనే మీడియా ముందుకు ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఒడిశా యువతిపై అత్యాచారయత్నం - attempt
గుంటూరులో ఒడిశాకు చెందిన మహిళపై అత్యాచారయత్నం జరిగింది. ఈ నెల2న జరిగిన ఈ ఘటనలో పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం
ఒడిశా యువతిపై అత్యాచారయత్నం