ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సమాజాన్ని జాగృతం చేసిన మహనీయుడు వేంకట కవి! - కొండవీటి వేంకటకవి

కొండవీటి వేంకటకవి శత జయంతి సందర్భంగా.. గుంటూరు కొమ్మినేని గార్డెన్స్​లో నిర్వహించిన సభకు హైకోర్టు న్యాయమూర్తి రజని, ప్రముఖ రచయిత రాచపాలెం చంద్రశేఖరరెడ్డి, కవి కత్తి పద్మారావు, వేంకటకవి కుటుంబీకులు హాజరయ్యారు. వేంకటకవి రచించిన పుస్తకాల సంపుటిని జస్టిస్ రజని ఆవిష్కరించారు.

కొండవీటి వేంకటకవి శత జయంతి

By

Published : Apr 3, 2019, 8:58 PM IST

Updated : Apr 3, 2019, 10:33 PM IST

కొండవీటి వేంకటకవి శత జయంతి
సామాజిక వివక్ష సరికాదని దశాబ్దాల క్రితమే చాటిన మహనీయుడు కొండవీటి వేంకటకవి అని సాహితీ ప్రముఖులు కొనియాడారు. బలమైన వ్యక్తిత్వం ఉన్న తల్లిదండ్రుల సమక్షంలో పెరిగిన పిల్లలు.. విలువలతో పెరుగుతారని తన రచనలతో చాటారని కీర్తించారు. కొండవీటి వేంకటకవి శత జయంతి సందర్భంగా.. గుంటూరు కొమ్మినేని గార్డెన్స్​లో నిర్వహించిన సభకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రజని, ప్రముఖ రచయిత రాచపాలెం చంద్రశేఖరరెడ్డి, కవి కత్తి పద్మారావు, వేంకటకవి కుటుంబీకులు హాజరయ్యారు. మృదు స్వభావం, సంస్కారం అనే రెండు లక్షణాల్ని ప్రతిఒక్కరూ అలవర్చుకుంటే రాజ్యాంగ సూత్రాలు ఎక్కడా ఉల్లంఘనకు గురికావని ముఖ్య అతిథి జస్టిస్ రజని చెప్పారు. వేంకటకవి రచించిన పుస్తకాల సంపుటిని ఆమె ఆవిష్కరించారు.

కులాలు, మతాలు లేని, దోపిడీ లేని సమాజాన్ని, ఆర్థిక సమానత్వాన్ని వేంకట కవి కోరుకున్నారని రాచపాలెం చంద్రశేఖరరెడ్డి చెప్పారు. అక్షరం అనేది అందరిసొత్తు అని... సమాజంలోని ఏ కులానికి సొంతం కాదన్న గొప్ప విషయాన్ని చెప్పిన గొప్ప వ్యక్తి అని... కత్తి పద్మారావు కొనియాడారు. తన గురువు, వేంకటకవితో ఉన్న అనుబంధాన్ని, శిష్యుల పట్ల ఆయన చూపించిన ఆత్మీయతను గుర్తు చేసుకున్నారు.

Last Updated : Apr 3, 2019, 10:33 PM IST

ABOUT THE AUTHOR

...view details