- MANSAS TRUST: మాన్సాస్ ట్రస్ట్ కళాశాలల ఉద్యోగుల ఆందోళన
విజయనగరం మాన్సాస్ కార్యాలయాన్ని ట్రస్టు కళాశాల ఉద్యోగులు ముట్టడించారు. జీతాల బకాయిలు చెల్లించాలని కార్యాలయం ముందు బైఠాయించారు. జీతాలు ఎందుకు నిలిపివేశారని మాన్సాస్ అధికారులను.. కళాశాల ఉద్యోగులు ప్రశ్నించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ప్రధాని మోదీకి ఎంపీ రఘురామ లేఖ..నీటి కేటాయింపు గెజిట్‌పై అభినందనలు
ప్రధాని మోదీకి ఎంపీ రఘరామకృష్ణరాజు లేఖ రాశారు. నీటి కేటాయింపు గెజిట్‌పై ప్రధానికి ఆయన అభినందనలు తెలిపారు. ఏడెళ్లు పూర్తయినా రాష్ట్రంలో కార్పొరేషన్ల విభజన జరగలేదని లేఖలో వెల్లడించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- water war: సీఎంల తీరుతోనే కేంద్రం పెత్తనం: సోమిరెడ్డి
ఇద్దరు సీఎంల మొండివైఖరి వల్ల నీళ్ల మీద పెత్తనం కేంద్రప్రభుత్వం చేస్తోందని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ASHOK GAJAPATHI RAJU: 'మాన్సాస్ ట్రస్ట్‌లో ఆడిట్ జరిపించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే'
మాన్సాస్ మాజీ ఛైర్మన్, దివంగత ఆనంద గజపతిరాజుకు ప్రస్తుత మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్ అశోక్ గజపతిరాజు నివాళులు అర్పించారు. రాష్ట్ర ప్రభుత్వానికి జ్ఞానం ప్రసాదించమని పైడితల్లి అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 17 కిలోల బంగారం, రూ.5 లక్షలు చోరీ!
మణిరూపమ్ గోల్డ్ దుకాణంలో సిబ్బందిని తుపాకులతో బెదిరించి చోరీ చేశారు దుండగులు. క్షణాల్లోనే 17 కిలోల బంగారం, రూ.5 లక్షలు లూటీ చేశారు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్ ఆగ్రాలో జరిగింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- శాంతించిన కెప్టెన్.. సిద్ధూకే పంజాబ్ పగ్గాలు!
పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఆ రాష్ట్ర మాజీ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధూకు ఇచ్చేందుకు మార్గం సుగమమైందా? తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తోన్న ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ వెనక్కి తగ్గారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- VIRAL: కరోనా సంక్షోభం.. అంతా 'శానిటైజర్' మయం!
వీధి దీపాలు, విద్యుత్ స్తంభాలు చూసినప్పుడు రెండు చిట్టి చేతులు వాటి కింద వాలిపోతున్నాయి. తర్వాత అరచేతులను అద్దుకుంటున్నాయి. ఆ పాప ఏం చేస్తోందో తెలుసుకోవాలనుకునే వారికి నవ్వు రాక మానదు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Joker: మాల్‌వేర్ మళ్లీ వస్తోంది.. జాగ్రత్త!
గత కొంత కాలంగా ప్లేస్టోర్‌లోని యాప్‌లపై ఓ మాల్‌వేర్ దాడి చేస్తోంది. సాంకేతిక నిపుణులను సైతం ఆందోళనకు గురిచేస్తున్న ఈ మాల్‌వేర్ పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Tokyo Olympics: ఒలింపిక్స్ వద్దంటూ ప్రజల నిరసన
కరోనా ఉద్ధృతి తీవ్రంగా ఉన్నప్పటికీ టోక్యోలో ఒలింపిక్స్‌ను నిర్వహించడంపై మండిపడుతున్నారు అక్కడి ప్రజలు. మరో వారం రోజుల్లో పోటీలు ప్రారంభమవబోతున్న నేపథ్యంలో కొందరు ఒలింపిక్స్ విలేజ్ దగ్గర నిరసన ప్రదర్శనకు దిగారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- MAA Elections: బాలయ్య వ్యాఖ్యలకు నాగబాబు కౌంటర్!
'మా' ఎన్నికలపై నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు నటుడు నాగబాబు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సేకరించిన విరాళాలు కేవలం సంక్షేమం కోసమేనని, భవనం నిర్మించడానికి కాదని స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ప్రధాన వార్తలు @ 5PM