రెండు నెలల పాలనతో వైకాపా సత్తా ప్రజలకు పూర్తిగా అర్థమైందని తెలుగుదేశం పార్టీ నేతలు ఎద్దేవా చేశారు. అభివృద్ధి, సంక్షేమం విషయంలో వైకాపా చేతులెత్తేసిందని... మళ్లీ ప్రజలు ఆలోచన చేస్తున్నారని ఎమ్మెల్సీ రామకృష్ణ, తెదేపా అధికార ప్రతినిధి వేమూరి ఆనందసూర్య అభిప్రాయపడ్డారు. గుంటూరులోని తెదేపా రాష్ట్ర కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు.ఐదేళ్ల చంద్రబాబు పాలనను రంధ్రాన్వేషణ చేయడమే... జగన్ ప్రభుత్వానికి సరిపోతోందన్నారు. ప్రజలు అందుకే అధికారం ఇచ్చారా... అని ప్రశ్నించారు. సీబీఐ కేసులో నిందితుడిగా ఉన్న నిమ్మగడ్డ ప్రసాద్‌ను విడిపించేందుకు విజయసాయిరెడ్డి, మిగతా వైకాపా ఎంపీలు కేంద్రమంత్రికి లేఖ రాయడం సరికాదన్నారు. ప్రత్యేకహోదా తెస్తారని ఓట్లేసిన ప్రజలకు వైకాపా ఎంపీలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
'అరవై రోజుల్లోనే వైకాపా సత్తా తెలిసిపోయింది' - jagan government
60 రోజుల పాలనతో వైకాపా పనితీరు ప్రజలకు అర్థమైందని... తెదేపా నేతలు ఎద్దేవా చేశారు. గుంటూరులోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ రామకృష్ణ, తెదేపా అధికార ప్రతినిధి వేమూరి ఆనందసూర్య మీడియాతో మాట్లాడారు.
ఎమ్మెల్సీ రామకృష్ణ