ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రభుత్వం ఆదేశిస్తే శాసనసభ సమావేశాల నిర్వహణకు సిద్ధం: స్పీకర్ తమ్మినేని - శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్న స్పీకర్ తమ్మినేని దంపతలు

ప్రభుత్వం ఆదేశిస్తే శాసనసభ సమావేశాలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామని శాసనసభ సభాపతి తమ్మినేని సీతారాం అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని శ్రీలక్ష్మీ నరసింహస్వామివారిని సభాపతి దంపతులు దర్శించుకున్నారు.

Speaker Tammineni Sitaram visit Mangalagiri
శాసనసభ సభాపతి తమ్మినేని సీతారాం

By

Published : Jul 26, 2021, 4:27 PM IST

గుంటూరు జిల్లా మంగళగిరిలోని శ్రీలక్ష్మీ నరసింహస్వామివారిని సభాపతి తమ్మినేని సీతారాం దంపతులు దర్శించుకున్నారు. ఆలయ ఆధికారులు.. సభాపతి దంపతులకు ఘన స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం స్పీకర్​కు స్వామి వారి చిత్రపటంతోపాటు తీర్థప్రసాదాలు అందజేశారు.

అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రభుత్వం ఆదేశిస్తే శాసనసభ సమావేశాలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. మహిళల రక్షణకు దిశ చట్టం ఓ బలమైన కవచంగా పని చేస్తోందన్నారు. 'దిశ చట్టం' మహిళల చేతిలో పాశుపతాస్త్రంలా ఉందన్నారు. రాష్ట్రంలోని పురాతన ఆలయాలకు వారసత్వ గుర్తింపు ఇచ్చేందుకు వైకాపా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details