గుంటూరు జిల్లా మంగళగిరిలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ(Sri Lakshmi Narasimha Swamy Temple) భద్రతకు అధికారులు చర్యలు చేపట్టారు. అందులో భాగంగా.. ఆలయ మాఢ వీధుల్లోకి భారీ వాహనాలు రాకుండా గడ్డెర్లు బిగించారు. మాఢ వీధుల్లో ద్విచక్రవాహనాలు మినహా ఇతర వాహనాల రాకపోకలను నిషేధించారు. ఆలయ భద్రత దృష్ట్యా(safety measurements) భక్తులు, స్థానికులు సహకరించాలని మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ హేమమాలిని రెడ్డి కోరారు.
గతంలో కురిసిన భారీ వర్షాలకు ఆలయం ప్రహారి గోడ కూలింది. గోపురం అంతస్తుల గోడలు పగుళ్లు రావడంతో.. అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. నగరపాలక అధికారులు, ఆలయ అధికారులు ఆలయ భధ్రత కోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని ఆలయ ఈవో రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు.