గుంటూరులోని అరండల్పేట పోలీస్ స్టేషన్ ఎదుట.. షేక్ పర్దీన్ వలి అనే యువకుడి మృతదేహంతో బంధువులు నిరసన చేపట్టారు. ప్రేమించిన అమ్మాయి తరఫు వారి వేధింపుల వల్లే అతడు ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించారు. వారిపై చట్టపరంగా చర్యలు చేపట్టాలని ముస్లిం సంఘాల ప్రతినిధులతో కలిసి డిమాండ్ చేశారు. కొరిటెపాడుకు చెందిన మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. నిందితులను కఠినంగా శిక్షిస్తామని సీఐ శ్రీనివాసరావు హామీ ఇవ్వగా.. ఆందోళన విరమించారు.
మృతదేహంతో ఠాణా ఎదుట బంధువుల ఆందోళన
ప్రేమించిన అమ్మాయి తరఫువారి వేధింపుల వల్లే షేక్ పర్దీన్ వలి అనే యువకుడు మరణించాడంటూ.. అతడి బంధువులు ఆందోళనకు దిగారు. నిందితులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ.. గుంటూరు నగరంలోని అరండల్ పేట పోలీస్ స్టేషన్ ఎదుట నినాదాలు చేశారు.
మృత దేహం