గుంటూరు జిల్లాలో కొవిడ్ కేసుల ఉద్ధృతి కొనసాగుతోంది. తాజాగా రికార్డు స్థాయిలో 621 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్క గుంటూరు నగరంలోనే 297 పాజిటివ్ కేసులను గుర్తించారు. తెనాలిలో 72, మంగళగిరి 27 , నరసరావుపేట 26, తాడేపల్లి 25, చిలకలూరిపేట13, చేబ్రోలు 10, ఫిరంగిపురం, సత్తెనపల్లిలో 7 చొప్పున పాజిటివ్ కేసులు రికార్డ్ అయ్యాయి.
తాజా కేసులతో గుంటూరు జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 84 వేల 128కి చేరుకుంది. జిల్లాలో ప్రస్తుతం 3,573 కేసులు క్రియాశీలంగా ఉన్నాయి. ఇవాళ కరోనాతో ఒకరు మృతి చెందగా..మొత్తం మృతుల సంఖ్య 689కి పెరిగింది. జీజీహెచ్, తెనాలి ప్రభుత్వ ఆస్పత్రులతోపాటు కొవిడ్ కేర్ సెంటర్లు రోగులతో నిండిపోయాయి.