ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'పన్నులు వేసినా ఫర్వాలేదు.. సౌకర్యాలు కల్పించండి'

ఎక్కడైనా పన్నులు పెంచారని ఆందోళనలు చేయడం సహజం. కానీ అందుకు భిన్నంగా గుంటూరు నగరపాలక సంస్థ వద్ద 48 వ డివిజన్ కు చెందిన కొందరు పన్నులు విధించండి.. మౌలిక సదుపాయాలు కల్పించండంటూ ఆందోళన నిర్వహించారు.

By

Published : Dec 21, 2020, 4:27 PM IST

people demand taxes in guntur district
పన్నులు వేయాలంటూ గుంటూరులో వినూత్న ఆందోళన

మాకు పన్నులు విధించి.. మౌలిక సదుపాయాలు కల్పించండి అంటూ గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయం 48 వ డివిజన్ కు చెందిన వారు సామూహిక రాయబారం పేరిట ఈ వినూత్న ఆందోళన నిర్వహించారు. డివిజన్ పరిధిలోని హిమనీనగర్, మదర్ థెరిసా కాలనీ, ప్రగతి నగర్, ఎస్టీ కాలనీల్లో పేదలు 30 ఏళ్లుగా నివాసం ఉంటున్నా.. ఎలాంటి సౌకర్యాలు కల్పించటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కాలనీల్లో కనీసం తాగునీటి సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నట్లు వారు తెలిపారు. పన్నులు వసూలు చేసినా ఫర్వాలేదు కానీ.. రోడ్లు, తాగునీరు, డ్రైనేజి వసతులు కల్పించాలని అధికారులను డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details