గుంటూరు-కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. ఉదయం 8 గంటల నుంచి గుంటూరు-కృష్ణా ఓట్లను గుంటూరు ఏసీ కళాశాలలో, ఉభయ గోదావరి ఓట్లను కాకినాడ జెఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలలో లెక్కిస్తారు. సాధారణ ఎన్నికలతో పోలిస్తే ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ భిన్నంగా ఉంటుంది. మొదటి ప్రాధాన్యత ఓట్లు 50 శాతానికిపైగా వచ్చినవారు విజేత అవుతారు. ఎవరికీ 50శాతం ఓట్లు రాకపోతే... ద్వితీయ ప్రాధాన్యత ఓట్ల లెక్కిస్తారు. అక్కడా ఫలితం తేలకపోతే తృతీయ ప్రాధాన్యత ఓట్లు లెక్కిస్తారు. ఇలా చేయాల్సి వస్తే ఫలితం తేలేందుకు దాదాపు 24 గంటలు పట్టే అవకాశం ఉంది. అందుకోసం మూడు షిఫ్టుల్లో సిబ్బందిని నియమించారు.
ఎమ్మెల్సీ ఎన్నికలు: ఉపాధ్యాయుల తీర్పు వెల్లడి నేడే - Krishna-Guntur Teachers MLC elections news
గుంటూరు-కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటల నుంచి ప్రారంభం కానుంది. ఫలితం తేలేందుకు దాదాపు 24 గంటలు పట్టే అవకాశం ఉంది. అందుకోసం మూడు షిఫ్టుల్లో సిబ్బందిని నియమించారు.
ఎమ్మెల్సీ ఎన్నికలు: ఉపాధ్యాయుల తీర్పు వెల్లడి నేడే