ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

జీజీహెచ్​లో మంత్రి శ్రీరంగనాథరాజు పర్యటన - sri ranganatha raju visit guntur ggh

గుంటూరు జీజీహెచ్​లో రోగుల సహాయకుల విశ్రాంతి భవనాన్ని వచ్చే డిసెంబర్​లోగా ప్రారంభిస్తామని మంత్రి శ్రీరంగనాథరాజు అన్నారు. స్థానిక ఎమ్మెల్యే ముస్తఫాతో కలిసి మంత్రి... జీజీహెచ్ లో పర్యటించారు.

minister sri ranganatha raju
minister sri ranganatha raju

By

Published : Nov 21, 2020, 6:59 PM IST

గుంటూరు జీజీహెచ్​లో రోగుల సహాయకుల విశ్రాంతి భవనాన్ని వచ్చే డిసెంబర్​లోగా ప్రారంభించనున్నామని గృహనిర్మాణ శాఖ మంత్రి శ్రీరంగనాథ రాజు అన్నారు. డిసెంబర్ 10లోగానే నిర్మాణాన్ని పూర్తి చేసి అప్పగించాలని ఇంజినీరింగ్ అధికారులను కోరారు. ఎమ్మెల్యే ముస్తఫాతో కలిసి జీజీహెచ్​లో పర్యటించిన మంత్రి... భవన నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించారు.

రోజుకు రెండుపూటలా 300 మంది రోగుల సహాయకులకు ఉచితంగా భోజనం అందించేందుకు ఏపీఎన్జీవోలు ఈ భవనాన్ని నిర్మిస్తుండగా... జీజీహెచ్​లో నిత్యాన్నదాన పథకానికి మంత్రి శ్రీరంగనాథరాజు సొంతంగా కోటి రూపాయలు విరాళాన్ని ప్రకటించారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై ముఖ్యమంత్రి కమిటీలను ఏర్పాటు చేశారని... కమిటీలు ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుందని శ్రీరంగనాథరాజు చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details