ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కృషి చేయండి: లోకేశ్ - magalagiri

స్థానిక ఎన్నికల నాటికి తెదేపా పుంజుకునేలా పనిచేయాలని కార్యకర్తలకు మాజీ మంత్రి నారా లోకేశ్ సూచించారు. ఓ కార్యకర్త పుట్టినరోజు సందర్భంగా మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో కేకు కోసి తినిపించారు.

తెదేపా కార్యకర్తలతో లోకేశ్

By

Published : Jul 5, 2019, 7:25 PM IST

కార్యకర్తలకు లోకేశ్ దిశానిర్దేశం

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వరుసగా రెండో రోజు గుంటూరు జిల్లా మంగళగిరి పార్టీ కార్యాలయంలో నేతలతో సమావేశమయ్యారు. మండలాల వారీగా నాయకులు పలు సమస్యలను లోకేశ్‌ దృష్టికి తీసుకొచ్చారు. ప్రజలకు తెదేపా అండగా ఉందన్న భరోసా ఇచ్చేందుకు కృషి చేయాలని లోకేశ్ పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల నాటికి పార్టీని బలోపేతం చేయాలని నేతలకు సూచించారు. క్షేత్రస్థాయిలో పనిచేసే కార్యకర్తలకు అండగా నిలవాలని చెప్పారు. జూలై 8న మంగళగిరిలో చంద్రబాబు పర్యటన నేపథ్యంలో నేతలతో సమీక్షించారు. పార్టీ కార్యకర్త పుట్టినరోజు సందర్భంగా లోకేశ్ కేక్ కోసి తినిపించారు.

ABOUT THE AUTHOR

...view details