బాధ్యతగా వ్యవహరిస్తే మెరుగైన భారత్ :ఇన్ఫోసిస్ అధినేత - kl university
పారిశ్రామికంగా దేశం అభివృద్ధి చెందుతున్నా... పేదరికం ,నిరక్షరాస్యత, అవినీతి సమస్యలు మాత్రం ఇంకా పట్టి పీడిస్తునే ఉన్నాయని ఇన్ఫోసిస్ అధినేత నారాయణ మూర్తి వ్యాఖ్యానించారు.
పారిశ్రామికంగా దేశం అభివృద్ధి చెందుతున్నా... పేదరికం ,నిరక్షరాస్యత, అవినీతి సమస్యలు మాత్రం ఇంకా పట్టి పీడిస్తునే ఉన్నాయని ఇన్ఫోసిస్ అధినేత నారాయణ మూర్తి వ్యాఖ్యానించారు. ప్రతి ఒక్కరు బాధ్యతగా వ్యవహరిస్తే మెరుగైన భారతాన్ని చూడొచ్చని ఆకాంక్షించారు. గుంటూరు కె.ఎల్ డీమ్డ్ వర్సిటీ 8వ స్నాతకోత్సవానికి ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి, రైతు నేస్తం ఫౌండేషన్ ఛైర్మన్ యడ్లపల్లి వెంకటేశ్వరరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. పి.హెచ్.డి, ఇంజినీరింగ్ విద్య పూర్తి చేసిన విద్యార్థులకు పట్టాలు అందజేశారు.